ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 3:09 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భీమారంలో ఘనంగా వనమహోత్సవం:

భీమారంలో ఘనంగా వనమహోత్సవం:

భీమారం (మంచిర్యాల) అర్జున్ సమాచారం, ఆగస్టు 25 :

భీమారం గ్రామపంచాయతీ పరిధిలో వనమహోత్సవ కార్యక్రమం మంగళవారం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ సర్పంచ్ ఉస్కమల్ల విజయలక్ష్మి మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీణ పలు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా భీమారం గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి ఉష్కమల్ల విజయలక్ష్మి పున్నం చందు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణం సమతుల్యంగా ఉండటంతో పాటు పొల్యూషన్ ఫ్రీ వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ బాధ్యతగా భావించి ప్రతి ఇంటా కనీసం ఒక మొక్క నాటి, దానిని సంరక్షించాలని ఆమె కోరారు.

ఈ వనమహోత్సవ కార్యక్రమంలో భీమారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీణ , మండల పరిషత్ అధికారి సతీష్ రెడ్డి , గ్రామ పంచాయతీ కార్యదర్శి పెద్దపల్లి మల్లేష్ , వార్డు సభ్యులు ఏసు ,తిరుపతి పాటు పలువురు స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.